ఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపాలి : ప్రజా సంఘాల నాయకులు 

ఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపాలి : ప్రజా సంఘాల నాయకులు 
  • నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
  • ప్రజా సంఘాల నాయకులు

సిద్దిపేట టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపాలని  ప్రజా సంఘాల నాయకులు డిమాండ్​చేశారు. గురువారం సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును హత్య చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేటలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అడవుల్లో ఉన్న వనరులను కార్పొరేట్ బడా బాబులకు కట్టబెట్టడం కోసం ఆదివాసులను హతమారుస్తున్నారని, మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే సంవత్సరం మార్చి కల్లా నక్సలైట్లను నిర్మూలిస్తామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాగుల భూపతి, ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ సత్తయ్య, పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు భీమసేన, రోమాల బాబు, మొగిలి, భిక్షపతి, కమలాకర్,  దుర్గరాములు, ఆనంద్, యాదగిరి పాల్గొన్నారు.