కేంద్రం జీఎస్టీ పెంచి పేదల నడ్డి విరుస్తోంది

కేంద్రం జీఎస్టీ పెంచి పేదల నడ్డి విరుస్తోంది

ఏదేమైనా రైతుల నుంచి ప్రతి గింజా కొంటామని చెప్పిన బండి సంజయ్ ఎక్కడ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర విధానాలతో రైస్ ఇండస్ట్రీ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆరోపించారు. FCI వ్యవహరించే తీరు బాధాకరమన్న ఆయన.. CMR రైస్ ను 48రోజులుగా తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. కేవలం తెలంగాణలోనే FCI ఇలా వ్యవహరిస్తోందని, రైస్ మిల్లర్లను బ్లాక్ చేసేలా నిబంధనలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. FCI హద్దు మీరి రైస్ మిల్లులపై ఉద్దేశపర్వకంగానే దాడులు చేస్తోందన్న ఎమ్మెల్యే.. యాసంగి పంటను సాగుచేయాలన్న బండి సంజయ్ ఎక్కడపోయారని ప్రశ్నించారు. రైతులకు ఎంపీ అర్వింద్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెంచి పేదల నడ్డి విరుస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కామెంట్స్ దుయ్యబట్టారు. పాలపై కూడా జీఎస్టీ పెంచడం దారుణమన్న ఆయన.. పెట్రోల్, డీజిల్ ధరలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని, రైస్ మిల్లర్లపై ఆధారపడ్డ కార్మికుల నిరసనలకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.