
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి కరోనా బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తొలిరోజు 24,224 మంది బూస్టర్ డోసు తీసుకున్నారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ బూస్టర్ వేయించుకోవాలని ఆయన కోరారు. ఇక రాష్ట్రంలో శుక్రవారం 556 కరోనా కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. ప్రైవేటు హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్ సెంటర్లపై కంప్లైంట్లకు కొత్త నంబర్ 9030227324 ను ప్రకటించారు. ఫిర్యాదులుంటే ఈ నంబర్‌కు వాట్సాప్ చేయాలన్నారు.