
కరీంనగర్ టౌన్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువలా వచ్చాయి. కరీంనగర్ కలెక్టరేట్లో కలెక్టర్ పమేలాసత్పతి పాల్గొని 290దరఖాస్తులను స్వీకరిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావా ణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చిట్టెల మైసవ్వ -రాములు తమ 2.37 ఎకరాల భూమిని వ్యక్తిగత అవసరాల కోసం అమ్మేందుకు స్లాట్ బుక్ చేసుకున్నా, తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయించడం లేదని వినతి పత్రం సమర్పించారు. ఇంటి పర్మిషన్ ఇవ్వాలని శంకరపట్నం మండలం కరీంపేట గ్రా మానికి చెందిన వనపర్తి రజిని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలుమహేశ్వర్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రజావాణి అర్జీలను ఎప్ప టికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన 189 దరఖాస్తులు స్వీకరించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొలకాని శంకరయ్య తన భూ సమస్యను పరిష్కరిం చాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కాగా గతంలోనే శంకరయ్య కలెక్టరేట్లో ఫిర్యాదు చేయగా.. సమస్య పరిష్కారం కాకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి పాల్గొన్నారు.ప్రజల సమస్యల పరిష్కారానికేగ్రీవెన్స్ డే నిర్వహిస్తు న్నామని ఎస్పీమహేశ్ బి గీతే అన్నారు. ఎస్పీ ఆఫీస్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో ప్రజల నుంచి 28 ఫిర్యా దులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను వెంటనేపరిష్కరించాలని ఎస్ హెచ్ వోలను ఆదేశించారు.
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి లో ప్రజల నుంచి 43 ఫిర్యాదులను స్వీకరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో ఇండ్లు కోల్పో యిన వారితో కలిసి మాజీమంత్రిజీవన్రెడ్డి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. లబ్దిదారులకు గతంలోకే టాయించిన ఇందిరమ్మ పట్టా కాగితాలను ఆయనకు చూపించి లబ్దిదారులకు న్యాయం చేయాలని కోరారు.
మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన మర్రిపల్లి రాజ గంగారం అనే దివ్యాంగుడు తాను నిర్మించుకున్న ఇంటికి అడ్డుగా గోడ నిర్మించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్ ఎదుట నేలపై పడుకొని నిరసన తెలిపాడు. అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించాడు.