కరోనా మీద కోపంతో నెట్లో ఏం వెతుకుతున్నారో తెలుసా..

కరోనా మీద కోపంతో నెట్లో ఏం వెతుకుతున్నారో తెలుసా..

కొంచెం ‘గుడ్ న్యూస్’ కావాలి
కరోనా టెన్షన్ను దూరం చేసేందుకు జనాల ఆరాటం
మంచి వార్తల కోసం గూగుల్లో వెతుకుతున్నరు
‘గుడ్ న్యూస్ నెట్ వర్క్’ సైట్ కు 3 రెట్లు పెరిగిన ట్రాఫిక్

న్యూఢిల్లీ: ఇప్పుడు ఏ పేపర్ చదివినా, ఏ చానెల్ చూసినా మొత్తం కరోనా కేసులు, కరోనా చావులు, అక్కడిట్టా.. ఇక్కడట్టా అన్న వార్తలే. ఎప్పుడు పోతుందో తెలియని ఆ కరోనా మహమ్మారి చెడ్డ వార్తల నుంచి జనం ఇప్పుడు రిలాక్సేషన్ కోరుకుంటున్నారు. మంచి వార్తల కోసం ఆరాటపడుతున్నారు. పాజిటివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో గూగుల్లో గుడ్ న్యూస్ కోసం సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య పెరగడమే అందుకు ఉదాహరణ. ఈ ఏడాది ప్రారంభం నుంచి గుడ్ న్యూస్ కోసం చేస్తున్న సెర్చ్లులు 5 రెట్లు పెరిగాయి. 1990ల్లో గుడ్ న్యూస్ కోసమే మొదలుపెట్టిన ‘గుడ్ న్యూస్ నెట్ వర్క్’ అనే సైట్ కు గత నెల నుంచి ట్రాఫిక్ 3 రెట్లు పెరిగింది. సగటున కోటి మంది సైట్ ను చూస్తున్నట్టు కంపెనీ ఓనర్, ఎడిటర్ జెరి వీస్ కోబ్లీ చెప్పారు. ‘‘ప్రజలు మాకు పాజిటివ్ వార్తల లింకులు పంపిస్తున్నారు. వాళ్ల చుట్టుపక్కల
జరుగుతున్న స్ఫూర్తిని పెంచే ఆర్టికర్టిల్స్ ను షేర్ చేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు. ఇప్పటికే గార్డియన్, ఫాక్స్ న్యూస్, హఫ్ పోస్ట్, ఎంఎస్ఎన్, యాహూలు తమ వెబ్ సైట్లలో స్ఫూర్తిని రగిలించే స్టోరీల కోసం ఓ స్పెషల్ కాలమ్ నే పెట్టాయి. పోయినేడాది నుంచే సీఎన్ఎన్
కూడా ‘ద గుడ్ స్టఫ్’ పేరుతో ఓ న్యూస్ లెటర్ పబ్లిష్ చేస్తోంది. కరోనా నేపథ్యంలో దానికి సబ్స్క్రైబ్ చేసుకున్నోళ స్లంఖ్య 50 శాతం పెరగడం విశేషం.

సంక్షోభాన్నితట్టుకునేందుకు
బిహేవియర్ మార్చుకోవడానికి నెగెటివ్ న్యూస్ ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటారని, అయితే, ప్రస్తుతం కరోనా లాంటి సంక్షోభ సమయంలో ఒత్తిడికి చెక్ పెట్టేందుకు గుడ్ న్యూస్, పాజిటివ్ న్యూస్ వైపు చూస్తున్నారని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లోని ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్ ప్రొఫెసర్ స్టువర్ట్ సొరోకా అన్నారు. ఇప్పుడు సమస్యకు పరిష్కారం కనుగొనేందుకే జనాలు ట్రై చేస్తున్నారని, ఎదుటివాళ్లూ అలాగే ఉండాలనుకుంటున్నారని యూనివర్సిటీ ఆఫ్ కాన్సస్ లోని సెంటర్ ఫర్ మీడియా ఎంగేజ్ మెంట్ ఫ్రొఫెసర్ యాష్లీ ముద్దిమన్ అన్నారు.

For More News..

అమెరికన్ల పాలిట కొత్త హీరో.. ఫౌచీ

కరోనాను జయించిన 102 ఏళ్ల వృద్ధురాలు

రాష్ట్రంలో 800 దాటిన కరోనా కేసులు

దేశంలో 17 వేలు దాటిన కేసులు