ఫెస్టివల్​ షాపింగంతా ఆన్​లైన్​లోనే

ఫెస్టివల్​ షాపింగంతా ఆన్​లైన్​లోనే

ఇంట్రస్ట్ చూపుతున్న కస్టమర్స్​

ఈ– కామర్స్ సైట్ల ద్వారానే ఎక్కువ మంది షాపింగ్
గ్రోసరీస్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని కొనుగోలు
దేశవ్యాప్తంగా సర్వే చేసిన ‘లోకల్ సర్కిల్స్ సంస్థ’

హైదరాబాద్, వెలుగు: ఫెస్టివల్​సీజన్​వచ్చిందంటే సిటీలో ఏ షాపు చూసినా, ఏ మాల్ కి వెళ్లినా కస్టమర్స్ తో కిటకిటలాడుతుంటాయి. ప్రస్తుతం కరోనా భయంతో చాలా మంది ఆన్​లైన్​లోనే  తమకు కావల్సినవి ఆర్డర్ చేస్తున్నారు.  కరోనా ఎఫెక్ట్​.. లాక్​డౌన్​కారణంగా ఆరునెలలుగా సిటిజన్స్​ఆన్​లైన్​ షాపింగ్​కు అలవాటు పడ్డారు. అన్ లాక్  తర్వాత పరిస్థితులు మారినా బయటకు వెళ్లి షాపింగ్​చేసేందుకు ఇంట్రస్ట్ చూపడం లేదు. ‘లోకల్ సర్కిల్స్ సంస్థ’ దేశవ్యాప్తంగా ఫెస్టివల్​ షాపింగ్ పై సర్వే చేసింది. ఇందులో మన సిటీలో దాదాపు 70శాతం మంది ఆన్​లైన్​లో షాపింగ్ చేస్తున్నట్టు తేలింది. ఏది కొన్నా డోర్ స్టెప్ లో డెలివరీ కావడంతో  సిటిజన్స్ అన్నిరకాల వస్తువులను ఆన్​లైన్​లోనే ఆర్డర్​చేస్తున్నట్టు వెల్లడైంది.

అన్నీ ఫెస్టివల్ సీజన్​లోనే.. ​

సిటీలో అక్టోబర్, నవంబర్ లో షాపింగ్ సందడి ఎక్కువగా కనిపిస్తుంది. దసరా, దీపావళి పండుగలు ఉండడంతో బిజినెస్​ అధికంగా అవుతుంది. ఈ టైమ్​లోనే చాలామంది కొత్త వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, , కొత్త బట్టలు,  ఫర్నిచర్ ​ఇలా డిఫరెంట్​ఐటమ్స్​ కొంటుంటారు. అయితే కరోనా నేపథ్యంలో రద్దీ మార్కెట్స్, జనాలు అధికంగా ఉండే ప్లేసెస్ కి వెళ్లి షాపింగ్ చేయాలంటే భయపడుతున్నారు. ఇది ఆన్​లైన్​ షాపింగ్ చేయడానికి కారణంగా మారింది.

ఆన్​లైన్ ​బెటర్ అని..

లోకల్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా 50 టాప్ సిటీల్లో సర్వే కండక్ట్ చేసింది. దాదాపు 330 జిల్లాల నుంచి 3 లక్షలకు పైగా కస్టమర్ల ఒపీనియన్​తెలుసుకుంది. మన సిటీలో నిర్వహించిన పోల్ లో 4,496 మంది రెస్పాండ్​అయ్యారు. ఇందులో 41శాతం మంది ఈ – కామర్స్ వెబ్ సైట్స్, యాప్స్ నుంచి షాపింగ్ చేస్తామని తెలిపారు. మరో 29 శాతం మంది లోకల్ రిటైల్ స్టోర్స్ నుంచి ఆర్డర్స్ చేసుకుంటామని చెప్పారు. ఇంకో 16 శాతం మంది మాత్రం మాల్స్, మార్కెట్స్, లోకల్ రిటైలర్స్ వద్దకు వెళ్లి కొంటామని వ్యక్తం చేసినట్టు సంస్థ రిపోర్ట్​లో పేర్కొంది.  ఈ –కామర్స్ సైట్స్ లో షాపింగ్ చేస్తున్న వారిలో 60శాతం మంది సేఫ్టీ, 20శాతం మంది కన్వినియెన్స్ అని తెలిపారు.  ఆన్​లైన్​ లో తక్కువ ధరలో, నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చని, ఈజీగా రిటర్న్, రి ఫండ్ ఉంటుందని వ్యక్తం చేసినట్టు సర్వేలో తెలిపింది.

రిస్క్ తీసుకోలేం..

కరోనా కారణంగా బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది.  అన్నీ ఆన్​లైన్​లోనే  ఆర్డర్ చేస్తున్నాం. ఫెస్టివల్ షాపింగ్ కూడా ఆన్​లైన్​లోనే  చేయాలనుకుంటున్నాం. డిఫరెంట్ బ్రాండ్స్ పై చాలా డిస్కౌంట్స్, ఆఫర్స్ ఉన్నాయి. ఆర్డర్ చేసి తెప్పించుకోవడం చాలా బెటర్.

– లత శ్రీ, గృహిణి, జూబ్లీహిల్స్

ఈజీ ప్రాసెస్.. 

ఈ టైంలో బయటకు వెళ్లి నాలుగైదు షాపులు తిరగలేం. అందుకే ఆన్​లైన్​లో వెబ్ సైట్ లో ఆర్డర్ చేసుకుంటున్నాం. నచ్చినది ఆర్డర్ చేసుకోవచ్చు. నచ్చక పోతే రిటర్న్ చేయొచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ.

– దుర్గ, నర్సింగ్ స్టూడెంట్, ఫిలింనగర్

For More News..

తెలంగాణలో కొత్తగా 1,421 కరోనా కేసులు

జోష్ లేని దసరా.. పల్లెలు, పట్నంలో కానరాని సంబురం

అప్పు చెల్లించలేదని రైతు పొలంలో బ్యాంకోళ్ల ఎర్రజెండాలు