
వేములవాడ, వెలుగు : తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ వేములవాడలో రోడ్డు బ్లాక్ చేశారు. కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో రోడ్డుపై ఖాళీ డ్రమ్ములతో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. గత కొద్దిరోజులుగా నీరు రావడంలేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మహిళలు రాస్తారోకో చేయడంతో పట్టణంలో గంటసేపు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వెంటనే తాగునీటి సమస్య పరిష్కారిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.