రైతు రుణమాఫీపై ఆఫీసర్లు క్లారిటీ ఇస్తలేరు

రైతు రుణమాఫీపై ఆఫీసర్లు క్లారిటీ ఇస్తలేరు
  •    సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు

సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ పై సిద్దిపేట అర్బన్ మండలంలోని రైతులకు క్లారిటీ ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని సిద్దిపేట అర్బన్ మండల ప్రజా ప్రతినిధులు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ లక్ష రూపాయల రుణమాఫీ జరిగినా, రైతులు ఎంతమంది, రుణమాఫీ సంబంధిత వివరాలు ఏమిటి అనే విషయాన్ని ప్రజాప్రతినిధులు అడిగితే బ్యాంకు, అగ్రికల్చర్​ అధికారులు ఎందకు చెప్పడం లేదని నిలదీశారు.

Also Read : దేశభక్తి నేపథ్యంలో రానున్న రామ్

గ్రామాల్లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను శుభ్రపర్చడం లేదని, దీంతో అనేక సమస్యలు వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ, పంచాయతీ శాఖ ,శిశు సంక్షేమ శాఖ, ఐకేపీ, ఆర్టీసీ, రెవెన్యూ శాఖలపై చర్చించారు. పలు సమస్యలపై పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. సమావేశంలో వైస్ ఎంపీపీ అల్లం ఎల్లం, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు జీడిపల్లి కమలాకర్ రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.