న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ మార్చి క్వార్టర్‌లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేసింది. ఈ బ్యాంక్‌కు ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌లో రూ. 1,447 కోట్ల నికర లాభం వచ్చింది. ఇది ఏడాది ప్రాతిపదికన 47 శాతం గ్రోత్‌కు సమానం. మొండి బాకీలు తగ్గడంతో పాటు, వడ్డీ ఆదాయం పెరగడంతో బ్యాంక్ లాభం పెరిగింది.
కిందటేడాది మార్చి క్వార్టర్‌లో ఇండియన్ బ్యాంక్‌కు రూ.984 కోట్ల నికర లాభం వచ్చింది. బ్యాంక్‌కు వచ్చిన నికర వడ్డీ ఆదాయం రూ. 9,832 కోట్ల నుంచి రూ.12,244 కోట్లకు ఎగిసింది. 2022–23 కి గాను షేరుకి రూ.8.60 డివిడెండ్ ఇచ్చేందుకు బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది. రూ.4,000 కోట్లు సేకరించడానికి కూడా ఆమోదం తెలిపింది. ఇండియన్ బ్యాంక్ గ్రాస్ ఎన్‌పీఏల రేషియో ఏడాది ప్రాతిపదికన 2.27 శాతం నుంచి 0.90 శాతానికి తగ్గింది.
