లావణ్య చేసిన పాత్ర చాలా అరుదు

లావణ్య చేసిన పాత్ర చాలా అరుదు

గ్లామరస్‌‌‌‌ రోల్స్‌‌‌‌తో ఆకట్టుకుంటున్న లావణ్య త్రిపాఠి.. ఫస్ట్‌‌‌‌ టైమ్ చేసిన ఫిమేల్ సెంట్రిక్ మూవీ ‘హ్యాపీ బర్త్‌‌‌‌ డే’. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌ మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. జులై 8న సినిమా విడుదల కానుంది. నిన్న ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేశారు. ముఖ్య​అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ ‘ఇందులో లావణ్య చేసిన పాత్రలాంటివి హీరోయిన్స్‌‌‌‌కి చాలా అరుదుగా వస్తాయి. ట్రైలర్‌‌‌‌‌‌‌‌లో తను చాలా బాగుంది. సినిమా కూడా అలాగే ఉంటుందనిపిస్తోంది. రితేష్ రాణాకి తనపైనా, తన కథలపైనా నమ్మకం ఎక్కువ. వెటకారం కూడా ఎక్కువే. ప్యాన్ తెలుగు ఫిల్మ్ అనగానే నవ్వొచ్చింది. నాపై జోక్ వేశాడేమోనని అనుమానం కూడా కలిగింది. థ్రిల్లర్‌‌‌‌కి కామెడీని మిక్స్ చేయడం కష్టం. దాన్ని అచీవ్ చేశాడు రితేష్. సర్రియల్ కామెడీ అనేది తెలుగులో ఫస్ట్‌‌‌‌ టైమ్. అయినప్పటికీ పూర్తిస్థాయిలో చూపించారు. అదే ఈ సినిమా సక్సెస్‌‌‌‌కి కారణమవుతుంది. థియేటర్స్‌‌‌‌కి ప్రేక్షకులు రావడం లేదనే విషయంపై రకరకాల అనాలసిస్‌‌‌‌లు వినిపిస్తున్నాయి. నా అనాలసిస్‌‌‌‌ ప్రకారం... ఏది చేసినా పూర్తి స్థాయిలో చేసేయాలి. కామెడీ చేస్తే జనం విరగబడి నవ్వాలి. ఫైట్స్ చేస్తే అద్భుతంగా ఉండాలి. అంతే తప్ప హాఫ్​హార్టెడ్‌‌‌‌గా సినిమాలు తీస్తుంటే జనాలు థియేటర్‌‌‌‌‌‌‌‌కి రావడం లేదు. ఫుల్‌‌‌‌ప్లెడ్జ్‌‌‌‌డ్‌‌‌‌గా ఫుల్‌‌‌‌ జోష్‌‌‌‌తో తీస్తేనే జనం వస్తారు. ఈ సినిమాకి కూడా అలా వస్తారని నమ్ముతున్నా’ అన్నారు. 

రోల్‌‌‌‌ని ఫుల్‌‌‌‌గా ఎంజాయ్ చేశా

‘ఏదైనా డిఫరెంట్‌‌‌‌గా చేయాలనుకుంటున్న టైమ్‌‌‌‌లో ఈ మూవీ చాన్స్ వచ్చింది. పర్సనల్‌‌‌‌గా నాక్కూడా కామెడీ ఇష్టం కనుక వెంటనే ఎస్‌‌‌‌ చెప్పా. కామెడీ చేయడం కష్టమే అయినా రితేష్ వల్ల ఈజీ అయింది. రోల్‌‌‌‌ని ఫుల్‌‌‌‌గా ఎంజాయ్ చేశా’ అంది లావణ్య. డైరెక్టర్ మాట్లాడుతూ ‘ఇప్పుడు అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నట్టే గన్స్ ఉంటే ఎలా ఉంటుందనేది కాన్సెప్ట్. మన దేశంలో అది సాధ్యం కాదు కనుక ఒక కొత్త ప్రపంచంలో ఈ  స్టోరీని చూపించా. థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌కి కామెడీని మిక్స్ చేసి, నాన్‌‌‌‌ లీనియర్ స్క్రీన్‌‌‌‌ ప్లేతో తీశా. లావణ్య పేరు హ్యాపీ. తన బర్త్‌‌‌‌ డే రోజు జరిగే కథ కనుక ఈ టైటిల్’ అన్నాడు. ‘లావణ్య ఈ సినిమాకి మెయిన్ ఎసెట్. ‘జాతిరత్నాలు’ సినిమాని ప్రేక్షకులు ఎలాగైతే ఎంజాయ్ చేశారో,  మా సినిమాని కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు’ అన్నారు నిర్మాత రవిశంకర్. ఇది యునిక్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌తో వస్తున్న డిఫరెంట్‌‌‌‌ మూవీ అన్నారు మరో నిర్మాత చెర్రి.