బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు

సిద్దిపేట టౌన్, వెలుగు: సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నుంచి 80 మంది కాంగ్రెస్ లో చేరినట్లు పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణ తెలిపారు. శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు.

ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, సీనియర్ నాయకులు కాలీముద్దీన్, అంజన్న, యాదగిరి, బుచ్చిరెడ్డి, బాబురావు, యాదగిరి గౌడ్, పాండు, పద్మ, రవి, గోపి కృష్ణ, సాంబమూర్తి, మహిపాల్ రెడ్డి, మహేందర్, శ్రీనివాస్, అంజిరెడ్డి, వాహబ్, రాజిరెడ్డి, అజమాత్, రాజేశ్, ఖన్నా, వనజ, జనార్దన్ రెడ్డి, నవీన్, ప్రతాప్, ప్రవీణ్ పాల్గొన్నారు.