పుజారా రంజీ ట్రోఫీలో వరుసగా రెండో సెంచరీ

పుజారా రంజీ ట్రోఫీలో వరుసగా రెండో సెంచరీ

జైపూర్‌‌‌‌: టీమిండియా వెటరన్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ చతేశ్వర్‌‌‌‌ పుజారా (110) రంజీ ట్రోఫీలో వరుసగా రెండో సెంచరీతో చెలరేగాడు. దీంతో రాజస్తాన్‌‌‌‌తో శుక్రవారం ప్రారంభమైన ఎలైట్‌‌‌‌ గ్రూప్‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌లో తొలి రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌కు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 89.3 ఓవర్లలో 242/4 స్కోరు చేసింది.

74 రన్స్‌‌‌‌కే మూడు వికెట్లు కోల్పోయిన సౌరాష్ట్రను పుజారా, షెల్డన్‌‌‌‌ జాక్సన్‌‌‌‌ (78 బ్యాటింగ్‌‌‌‌) నాలుగో వికెట్‌‌‌‌కు 168 రన్స్‌‌‌‌ జోడించి ఆదుకున్నారు. ఇక చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌తో జరుగుతున్న గ్రూప్‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌లో ముంబై భారీ స్కోరు చేసింది. పృథ్వీ షా (159), భూపేన్‌‌‌‌ లాల్వాని (102) సెంచరీలు చేయడంతో తొలి రోజు ముంబై తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 86 ఓవర్లలో 310/4 స్కోరు సాధించింది.