ఊళ్లు ముంచుతున్న పులిచింతల నీళ్లు

ఊళ్లు ముంచుతున్న పులిచింతల నీళ్లు
  • వందల్లో ఎకరాల్లో పంట మునక
  • ముంపు జాబితాలోని లేని గ్రామాల్లోకి బ్యాక్‌ వాటర్‌
  • డ్యామ్‌ లో పూర్తి కెపాసిటీ నిల్వ చేస్తే ఏంటని ఆందోళన
  • ముం పు అంచనా వేయడంలో ఆఫీసర్లు ఫెయిల్

పులిచింతల ప్రాజెక్టు నిండుతుండడంతో రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా లోని డ్యామ్ సమీప ఊళ్లు ఆందోళనకు గురవుతున్నాయి. నాగార్జున సాగర్ నుంచి భారీగా వరద వస్తుండడంతో ఏపీలోని ఈ డ్యామ్ మొదటిసారిగా నిండుతోంది. శుక్రవారం రాత్రి వరకు ప్రాజెక్ట్​​లో నీటి నిల్వ 39 టీఎంసీలకు చేరింది. దీంతో ముంపు జాబితాలో లేని ఊర్లలోకి కూడా బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌ చొచ్చుకొస్తోంది. ఇప్పటికే మట్టపల్లి లక్ష్మీ నారసింహస్వామి గర్భాలయంలో నీరు చేరి నిత్య పూజలకు ఇబ్బంది కలుగుతోంది. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తి కెపాసిటీ 45.77 టీఎంసీలకు చేరితే ముంపు జాబితాలో లేనిపలు గ్రామాలు నీటమునిగేలా ఉన్నాయి.2013 లో నిర ్మించిన పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం45.77 టీఎంసీలు కాగా ఇప్పటి వరకూ ఆ స్థాయినీరు ఎప్పుడూ రాలేదు. 2016లో 30 టీఎంసీలకుచేరువైంది. అప్పుడు ఆరు లక్షల క్యూ సెక్కుల నీటినిదిగువకు వదలాల్ సి రావడంతో పూర్తి స్థాయిలో నిల్వచేయలేకపోయారు. ఎగువ నుండి వరద వస్తుండడం-తో సామర్థ్యం మేరకు నిల్వ చేయాలని అధికారులుభావిస్తు న్నారు. దీంతో మొదటిసారిగా ప్రాజెక్ట్‌‌‌‌  సామర్థ్య పరీక్షను ఎదుర్కోబోతోంది.

పులిచింతల ప్రాజెక్టు ముంపు జాబితాలో మూడుమండలాల్లోని 13 గ్రామాలు ఉన్నాయి. వాటిని పూర్తి,పాక్షిక ముంపునకు గురయ్యే ప్రాంతాలుగా గుర్తించిఆ మేరకు పరిహారం అందించారు. అయితే ఇప్పుడుముంపులో లేని చింతలపాలెం మండలం బుగ్గమాదా-రం, వజినేపల్లి, ముక్త్యా లలో వందల ఎకరాల పంటప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ముని గిపోయింది. ఆ గ్రామాలచుట్టూ ఇప్పటికే వరద కమ్ముకుం ది. ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగితే వీటికి మరింత ముప్పు ఏర్పడే ప్రమా-దముంది.

రోడ్లపైకి నీరు.. రాకపోకలకు బ్రేక్‌

పులిచింతల బ్యాక్ వాటర్ తో కొన్ని గ్రామాల మధ్యరోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్ప-డింది. ఔట్ ఫ్లో నీటితో మరికొన్ని రూట్లలో ప్రయాణంసాగించలేదని పరిస్థితి. చింతలపాలెం మండలం శో-భనాద్రిగూడెం-– కొత్త అడ్లూరు , చింతలపాలెం-–శోభ-నాద్రిగూడెం రూట్లలో నీరు నిలిచింది. కొత్త అడ్లూరు–-తమ్మారం మధ్య రాకపోకలు పూర్తిగా ఆగిపోయా-యి. అక్కడక్కడా రోడ్లపై ప్రవాహంతో దొండపాడు–జగ్గయ్యపేట మధ్య ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ నిలిచిపోయింది.

అన్నింటా ఫెయిల్

ప్రాజెక్టు ముంపు గ్రామాలను అంచనా వేయడంలోఅధికారులు పూర్తిగా విఫలమయ్యరని స్థానికు లు వి-మర్శిస్తు న్నారు. ముంపు జాబితాలో లేని గ్రామాలనువరద చుట్టు ముట్టడంపై ఆందోళన చెందుతున్నారు.మట్టపల్లి నర్సింహస్వామి ఆలయం చుట్టూ నిర్మించినరక్షణ గోడలో లోపాలు, మరో నాలుగడల మేర వరదవస్తే లక్ష్మీ ఆలయం పూర్తిగా నీట మును గుతుందనేవిషయాలేవీ అధికారులు అంచనా వేయలేకపోయారని అంటున్నారు.

ముంపులో మట్టపల్లి నారసింహుడు

  • గర్భగుడిలోకి చేరిన వరద నీరు
  • కలవరపెడుతున్న కరకట్ట లీకులు

 

మఠంపల్లి, వెలుగు: కృష్ణా తీరంలోని పంచనారసింహ క్షేత్రాల్లో ఒకటైన మట్టపల్లి లక్ష్మీ నర-సింహస్వామి ఆలయం ముంపునకు గురైంది.పులిచింత ప్రాజెక్టు బ్యాక్‌‌‌‌వాటర్‌‌‌‌ పెరగడంతోగర్భగుడిలోకి వరద నీరు చేరాయి. బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌ గుడిలోకి రాకుండా రెండు కోట్ల రూపాయలతోచుట్టూ కట్టిన కరకట్ట లీకులతో కలవరపెడుతోంది.క్షేత్రం చుట్టూ వరదనీరు, రక్షణగా కట్టిన గోడకులీకేజీలో ఆలయంలోకి భక్తులకు అనుమతించడంలేదు. మూడు రోజులుగా కరకట్ట పగుళ్ల నుంచినీరు లోపలకి రావడంతో భక్తులు ఇబ్బందికి గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున గర్భాలయంలోకి కూడా నీరు చేరాయి. దీంతో నిత్యపూజలు నిర్వహించడం కష్టం గా మారింది. ఉత్సవ విగ్రహం కూడా వేరే ఆలయానికి తరలించాల్సిన పరిస్థితి. డ్యామ్‌‌‌‌ పూర్తి కెపాసిటీలో నీటిని నిల్వ చేస్తేఆలయం పూర్తిగా నీట మునగనుంది. కాట్రాక్టర్ల లాభాపేక్షతో నాసి రకంగా కట్టిన కరకట్ట వరదతట్టు కుని ఆలయాన్ని కాపాడుతుందా అని భక్తులుకలవరపాటుకు గురవుతున్నారు. బ్యాక్ వాటర్ ఆల-యాన్ని ఎంత మేర ముపుకు గురిచేస్తుందో అంచనావేయడంలో ఆఫీసర్లు పూర్తిగా లెక్క తప్పారు. వరద ఉధృతి తట్టు కునేలా కరకట్ట నిర ్మించడంలో విఫలమయ్యారు. ఇప్పుడు ఆలయన్ని రక్షించడం కోసం ఏంచేయాలో పాలుపోని స్థితి. ఇప్పటి వరకు ఆలయన్నిపరిశీలించిన ఉన్నతాధికారులు ముంపు గురించి ప్రాజెక్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ దీని పై ఎవరూ దృష్టిసారించడం లేదు.