రేపు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో

రేపు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో

రాష్ట్ర వ్యాప్తంగా రేపు (ఆదివారం,మార్చి-10)  పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలోపు వయస్సున్న దాదాపు 35,12,333 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఆయా విభాగాలకు అవగాహన కల్పించి, 52,19,180 వ్యాక్సినేషన్ డోస్‌లు రెడీ చేసింది. మహిళా శిశు సంక్షేమశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీ రాజ్, ఐకేపీ, డిఫెన్స్, నేవీ, ఆర్టీసీ శాఖల సమన్వయంతో పోలియోచుక్కల కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆదివారం చేపట్టనున్న కార్యక్రమంలో పల్స్‌పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు, ఆ తర్వాత రెండు రోజులపాటు ఇంటింటికీ వెళ్లి వేసేందుకు వైద్యశాఖ ప్రణాళిక రూపొందించింది. ప్రయాణాల్లో ఉన్నవారి కోసం 787 మొబైల్ టీమ్స్ ద్వారా అన్నిబస్టాండ్లలో, రైల్వేస్టేషన్లలో, ప్రధాన కూడళ్లలో చుక్కల మందు వేయనున్నారు. పల్స్‌పోలియో కార్యక్రమంలో 95,513 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు వైద్యశాఖ తెలిపింది.