పల్స్​ పోలియోను సక్సెస్ ​చేయాలి

పల్స్​ పోలియోను సక్సెస్ ​చేయాలి
  • పల్స్​ పోలియోను సక్సెస్ ​చేయాలి
  • జిల్లాలో 2,800 కేంద్రాలు, 123 మొబైల్​ వెహికల్​ టీమ్స్​ ఏర్పాటు
  • హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ను పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని కలెక్టర్​అనుదీప్​ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మార్చి 3న నిర్వహించనున్న పల్స్​పోలియో కార్యక్రమాన్ని సక్సెస్​చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయమై సోమవారం జిల్లా కలెక్టరేట్​లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్​అనుదీప్​మాట్లాడుతూ.. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని, జిల్లాలో మొత్తం 5లక్షల6వేల930 మంది ఐదేండ్లలోపు చిన్నారులు ఉన్నారని, వారందరికీ పోలియో డ్రాప్స్ వేయాలని ఆదేశించారు. అందుకోసం 2,800 పోలియో కేంద్రాలు,123 మొబైల్ టీమ్స్​ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బస్టాండ్లు, రైAల్వే స్టేషన్లు, ముఖ్యమైన జంక్షన్లలో పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక ర్యాలీలు నిర్వహించి, విస్తృతంగా ప్రచారం చేయాలని డీఈఓను ఆదేశించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, ఆయా శాఖల అధికారులు పాల్గొనాలన్నారు. 4, 5, 6 తేదీల్లో ఇంటింటికి తిరిగి పోలియో డ్రాప్స్ వేయాలని, సినిమా థియేటర్లలో అవగాహన కల్పిస్తూ వీడియోలు ప్రదర్శించాలని చెప్పారు.  నర్సింగ్, పారా మెడికల్ స్టూడెంట్లు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఇన్​చార్జ్​మెడికల్​ఆఫీసర్ డాక్టర్ శ్రీకళ, అడిషనల్​మెడికల్​ఆఫీసర్​డాక్టర్ జయమాలిని, డీఈఓ రోహిణి, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు, సీడీపీఓలు, జిల్లా మైనార్టీ, సాంఘిక సంక్షేమ, విద్యుత్​శాఖ ఆఫీసర్లు పాల్గొన్నారు.

పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి

ప్రతి ఒక్కరూ పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్​ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 26  నుంచి మార్చి 2 వరకు హైదరాబాద్ జిల్లాలో ఆర్థిక అక్షరాస్యత వారాన్ని పాటిస్తోందన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రోహిణి, ఎల్ డీఎం జీఎం సుబ్రహ్మణ్యం, ఏఎల్ డీఎం ప్రదీప్ సింగ్, వివిధ బ్యాంకుల సిబ్బంది పాల్గొన్నారు.