మహారాష్ట్రలో సెప్టిక్ ట్యాంక్ ను క్లీన్ చేస్తూ ఇద్దరు కార్మికులు మృతి

మహారాష్ట్రలో సెప్టిక్ ట్యాంక్ ను క్లీన్ చేస్తూ ఇద్దరు కార్మికులు మృతి

మహారాష్ట్రలోని పూణేలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు పారిశుధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గల్లంతయ్యారు. హౌసింగ్ సొసైటీలోని సెప్టిక్ ఛాంబర్‌ను కార్మికులు శుభ్రం చేస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పూణేలోని వాఘోలి ప్రాంతంలో ఒక ప్రైవేట్ సొసైటీకి చెందిన సెప్టిక్ ఛాంబర్‌ను ఎప్పటిలాగే శుభ్రం చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఇద్దరు మృతి చెందగా, మరొకరు మిస్సయ్యారు. అయితే ఈ గల్లంతైన వ్యక్తి కోసం అధికారులు సెర్చింగ్ ప్రారంభించారు. కాగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

సెప్టిక్ ట్యాంక్ ను శుభ్రం చేస్తూ చనిపోవడం ఇదేం మొదటి సారి కాదు. ఈ తరహా ఘటనలు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇంతకు మునుపు చూసినవే. సెప్టిక్ ట్యాంకును క్లీన్ చేసే సమయంలో వెలువడే వాయువులతో ఊపిరాడక ఈ విధమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వారికి ఆ సమయంలో ప్రత్యేకమైన ఎక్విప్ మెంట్ ను సమకూర్చాలని గతంలో పలువురు కోరినా.. ఇప్పటికీ ఆ విషయంలో ఎలాంటి మార్పూ రాలేదు.