
స్మార్ట్ ఫోన్లు వచ్చినంక సెల్ఫీ చాలా ఫేమస్ అయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫంక్షన్లు అయినా.. ప్రయాణంలోనూ.. విహార యాత్రలో సరదాగా సెల్ఫీలతో దిగుతూ ఎంజాయ్ చేస్తారు. సెల్ఫీలతో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నారు. సెలబ్రిటీలు అవుతున్నాయి. సెల్ఫీ సరదా వినోదమే అయినా.. కొన్ని కొన్ని సార్లు ప్రమాదంలో పడేస్తుంది. ప్రాణాల మీదకు తెస్తుంది. అటువంటి ఇన్సిడెంట్ ఒకటి మహారాష్ట్రలో జరిగింది. పూర్తి వివరాల్లో వెళితే..
మహారాష్ట్ర లోని సతారా జిల్లా జోర్నెఘాట్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవ శాత్తు ఓ యువతి లోయలో పడిపోయింది. దాదాపు 150 అడుగుల లోతో ఉన్న లోయలో యువతి పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలో లోయలో పడ్డ యువతిని సేఫ్టీ బృందం పైకి లాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంత ఎత్తునుంచి లోయలో పడటంతో యువతికి తీవ్రంగా గాయాలయ్యాయి. సెఫ్టీ టీం సకాలంలో స్పందించడంతో ఆమె బతికి బయటపడింది.
ఇటీవల వర్షాలు కురుస్తు్న్నందున పర్యాటక ప్రాంతమైన బోర్నేఘాట్ కు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. పూణేకు చెందిన మహిళ తన స్నేహితులతో కలిసి బోర్న్ ఘాట్‌ను సందర్శనకు వచ్చింది. అయితే వర్షాలకు అక్కడి ప్రాంతమంతా బురదమయం కావడంతో యువతి సెల్ఫీ తీసుకుంటూ శనివారం ఆగస్టు 3,2024 న సాయంత్రం లోయలో పడిపోయింది. యువతిని స్థానికులు, సెఫ్టీ సిబ్బంది తాడు సాయంతో సురక్షితంగా లోయనుంచి బయటికి తీశారు. గాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
ఈ ఘటనతో బోర్నేఘాట్ లో ఘటన జరిగిన ప్రాంతానికి పర్యాటకులను నిషేధించారు స్థానిక అధికారులు. ఎవరైనా విహార యాత్రకు వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.