కాజీపేట వరకు పూణె-హైదరాబాద్ స్పెషల్ రైలు

కాజీపేట వరకు పూణె-హైదరాబాద్ స్పెషల్ రైలు

పూణె- హైదరాబాద్ ట్రై వీక్లీని కాజీపేట వరకు పొడిగించారు. వారానికి మూడుసార్లు నడవనున్న ఈ రైలు (నం.17013/17014) ను కాజీపేట టెర్మినల్‌కు మార్చగా సికింద్రాబాద్‌ మీదుగా ప్రయాణిస్తున్నదని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య సమాచార అధికారి కే రాకేశ్‌ తెలిపారు. రిజర్వేషన్‌ చేసుకొన్న ప్రయాణికులు స్టేషన్‌ టెర్మినల్‌లో మార్పును గమనించాలని అధికారులు సూచించారు.

అయితే ఇప్పటినుంచి హైదరాబాద్‌కు బదులుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ఈ రైలు వెళ్తుందని అధికారులు చెప్పారు. ఈరోజు నుంచి(అక్టోబర్ 09) ఈ రూల్ అమల్లోకి రానుందని వెల్లడించారు. రైలు నెం -17014 (హైదరాబాద్-పుణే) సాయంత్రం 6 గంటలకు బదులుగా సాయంత్రం 6.15 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు ప్రకటించారు. 

తెలంగాణ ప్రాంతంలో దక్షిణ మధ్య రైల్వే నాలుగు రైలు సర్వీసులను పొడిగించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో కాజిపేట-హడప్సర్ (పుణే) రైలును జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. దీంతోపాటుగా మరో మూడు రైళ్లను వర్చువల్ గా ప్రారంభించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ఈ నాలుగు రైళ్ళను పొడిగించింది. 

హడప్సర్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కాజీపేట వరకు పొడిగించారు. అలాగే జైపూర్‌-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను కర్నూలు సిటీ వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. 

1.   హడప్సర్ -హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ ను కాజీపేట వరకు

2.    జైపూర్ - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ ను కర్నూల్ పట్టణం వరకు

3.    నాందేడ్ - తాండూర్ ఎక్స్‌ప్రెస్‌ ను రాయచుర్ వరకు

4.    కరీంనగర్ - నిజామాబాద్ పాసెంజర్ ను బోధన్ వరకు

ఈ పొడిగించిన నాలుగు రైళ్ల సర్వీసులకు బుకింగ్‌లు అందుబాటులో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది. ఈరోజు(అక్టోబర్ 09) నుంచి పొడిగించిన 17014/17013 కాజీపేట రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది.