మంత్రులకు శాఖలు కేటాయించిన భగవంత్ మాన్

మంత్రులకు శాఖలు కేటాయించిన భగవంత్ మాన్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు. హోం శాఖను తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి.. హర్పాల్ చీమాకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పజెప్పారు. గుర్మీత్ సింగ్కు విద్య, డాక్టర్ విజయ్ సింగ్లాకు ఆరోగ్యం, హర్ జోత్కు న్యాయ, టూరిజం శాఖ కేటాయించారు. డాక్టర్ బల్జీత్ కౌర్కు సోషల్ సెక్యూరిటీతో పాటు ఉమెన్, చైల్డ్ డెవలప్మెంట్, హర్భజన్ సింగ్కు విద్యుత్, లాల్ చంద్కు పుడ్ అండ్ సప్లై, కుల్దీప్ సింగ్ దలీవాల్కు రూరల్ డెవలప్ మెంట్, పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలు కట్టబెట్టారు.


ఇదిలా ఉంటే పంజాబ్ 16వ అసెంబ్లీ స్పీకర్గా ఆప్ ఎమ్మెల్యే కుల్తార్ సింగ్ సంధ్వాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం భగవంత్ మాన్ స్పీకర్గా ఆయన పేరు ప్రతిపాదించగా.. కేబినెట్ మినిస్టర్ హర్పాల్ చీమ బలపరిచారు. 46 ఏళ్ల కుల్తార్ సింగ్.. భారత మాజీ రాష్ట్రపతి జైల్ సింగ్‌ సోదరుడి మనవడు.