టెంపరరీ ఉద్యోగులకు పంజాబ్ సీఎం గుడ్ న్యూస్

టెంపరరీ ఉద్యోగులకు పంజాబ్ సీఎం గుడ్ న్యూస్

చండీఘడ్: పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భగవంత్ మాన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా గ్రూప్ సీ, డీ కేటగిరీలో టెంపరరీగా పనిచేస్తున్న 35వేల మంది ఉద్యోగులను పర్మినెంట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీకీ ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ సీ, డీ కేటగిరీల్లో ఇకపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగాలు భర్తీ చేయొద్దని సీఎం మాన్ ఉత్తర్వులు జారీ చేశారు.

పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేబినెట్ తొలి భేటీలోనే 25వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో 15వేల పోస్టుల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినవి కాగా.. పోలీస్ శాఖలో మిగిలిన 10వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఎంపీ పదవికి అఖిలేశ్ యాదవ్ రాజీనామా

రాష్ట్రంలో కేసీఆర్ రాచరిక పాలన నడుస్తోంది