ఏఎస్ఐ హర్జీత్ సింగ్ పేరు పెట్టుకున్న పంజాబ్ డీజీపీ

ఏఎస్ఐ హర్జీత్ సింగ్ పేరు పెట్టుకున్న పంజాబ్ డీజీపీ

పాటియాలా : పంజాబ్ డీజీపీ దిన్ కర్ గుప్తా తన పేరును ఏఎస్ఐ హర్జీత్ సింగ్ గా పెట్టుకున్నారు. లాక్ డౌన్ డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ హర్జీత్ సింగ్ పై నిహంగ్ సిక్కులు ఏప్రిల్ 12 న దాడి చేశారు. ఈ ఘనటలో ఏఎస్ఐ హర్జీత్ సింగ్ చేయి తెగిపడింది. దాడి చేస్తున్న వారిని ఎదుర్కొన్న హర్జీత్ సింగ్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ డీజీపీ ఆయన పేరున్న బ్యాడ్జీని పెట్టుకున్నారు. పంజాబ్ పోలీసుల సోమవారం నాడు సోషల్ మీడియాలో #MainBhiHarjeetSingh పేరిట ఓ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్‌జీత్ సింగ్‌కు గౌరవసూచకంగా ఆయన పేరున్న బ్యాడ్జీలను పోలీసులు అందరూ పెట్టుకోవాలని డీజీపీ పిలుపిచ్చారు. ” కరోనాపై ఫైట్ చేస్తున్న డాక్టర్లు, హర్‌జీత్ లాంటి పోలీసులపై జరిగిన దాడులు దేశాన్ని ఒక్కటి చేస్తాయని చూపిద్దాం. హర్జీత్ సింగ్ లాంటి పోరాట యోధులకు సంఘీ భావంగా ఆయన పేరు మనమందరం ఛాతిపై గర్వంగా ధరిద్దాం ” అని డీజీపీ ట్వీట్ చేశారు. ప్రాణాలు లెక్క చేయకుండా విధులు నిర్వహించిన హ‌ర్జీత్ సింగ్ ను ఎస్. ఐ గా ప్రమోట్ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. ప్రస్తుతం చండీగఢ్ లోని ఓ హాస్పిటల్ లో హర్జీత్ సింగ్ కోలుకుంటున్నారు. దాదాపు 7 గంటల పాటు శ్రమించి హర్జీత్ సింగ్ కు డాక్టర్లు రీప్లాంటేషన్ చేశారు.