
న్యూఢిల్లీ: పంజాబ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. దేశంలోని చత్తీస్‌గఢ్, రాజస్థాన్ తర్వాత ఓపీఎస్‌ను తిరిగి ప్రారంభించనున్న మూడో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. ఈ స్కీమ్ ఇమిడియట్‌గా అమల్లోకి వస్తుందని శనివారం తెలిపారు.
ఇది చరిత్రాత్మక నిర్ణయమని, రాష్ట్ర ఉద్యోగులకు దీపావళి కానుక అని సీఎం మాన్ పేర్కొన్నారు. ఓపీఎస్ అమలుకు సోమవారం కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన దాదాపు 1.6 లక్షల మంది ఉద్యోగులకు ఈ స్కీం వర్తించనుంది.