CSK vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. ప్లేయింగ్ 11 నుంచి మ్యాక్స్ వెల్ ఔట్!

CSK vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. ప్లేయింగ్ 11 నుంచి మ్యాక్స్ వెల్ ఔట్!

ఐపీఎల్ 2025లో బుధవారం(ఏప్రిల్ 30) చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్  జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. చెపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు ధోనీ సేనకు చావో రేవో. ఒకవేళ ఓడిపోతే టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. మరోవైపు పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలిచి 13 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరువవుతుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే చెన్నై ఈ మ్యాచ్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు పంజాబ్ జట్టులో మ్యాక్స్ వెల్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, MS ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాంశ్ షెడ్జ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్   

►ALSO READ | IND vs ENG: టీమిండియాను దెబ్బ కొట్టడానికి దిగ్గజ బౌలర్‌ను సంప్రదించిన ఇంగ్లాండ్ క్రికెట్