పొలాల్లో గడ్డి కాల్చొద్దని చెప్పడానికి వస్తే.. అతన్నే కాల్చమన్నారు

పొలాల్లో గడ్డి కాల్చొద్దని చెప్పడానికి వస్తే.. అతన్నే కాల్చమన్నారు

ఇటీవలి కాలంలో ముంబై, ఢిల్లీ.. ఆ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆయా ప్రాంతాల్లో పొలాల్లో మంటలు, ఇతర దహన ఘటనలపై ఇప్పటికే నిషేధం విధించిన అక్కడి ప్రభుత్వం.. ఆ తరహా చర్యలపై దృష్టి సారించింది. అందులో భాగంగా పొలాల్లో దహనాన్ని నిరోధించే బృందంలో భాగమైన ఓ ప్రభుత్వ అధికారిని అడ్డుకున్నారు. పొలాల్లోని చెత్త కుప్పను తగులబెట్టమని అతన్ని బలవంతం చేసినందుకు పంజాబ్ పోలీసులు బటిండాలో కొంతమంది రైతులపై కేసు నమోదు చేశారు.

ముఖ్యమంత్రి భగవంత్ మాన్ Xలో ఓ వీడియో పోస్ట్ చేసి రైతుల చర్యను ఖండించడంతో ఈ సంఘటన నవంబర్ 3న వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వరి గడ్డిని కాల్చవద్దని రైతులను కోరడానికి ప్రభుత్వ అధికారి పొలాల్లోకి వెళ్లాడు. కానీ అగ్గిపుల్లతో గడ్డిని వెలిగించమని అక్కడి రైతులు అధికారిని బలవంతం చేశారని భగవంత్ మాన్ అన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు రైతులు అగ్గిపుల్లతో గడ్డికి నిప్పంటించమని బలవంతం చేస్తున్నప్పుడు అధికారి చేయి పట్టుకున్నట్లు చూపిస్తుంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రైతులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు భటిండా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు. ఈ రైతులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారని ఆయన చెప్పారు. అధికారి తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు రైతులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఎస్‌ఎస్‌పికి లేఖ రాసినట్లు బటిండా డిప్యూటీ కమిషనర్ షోకత్ అహ్మద్ పర్రే తెలిపారు. రైతు సంఘం పట్ల విధేయతతో 50-60 మంది రైతుల బృందం అధికారిని చుట్టుముట్టిందని, అతన్ని సమీపంలోని పొలానికి తీసుకెళ్లి గడ్డి కుప్పకు నిప్పంటించమని బలవంతం చేశారని పర్రే చెప్పారు. "అతను అంత మందిలో ఉన్నప్పుడు, అతనికి అతనికి వేరే మార్గం లేకపోయింది" అని DC పర్రే చెప్పారు.