పంజాబ్ లాస్ట్ పంచ్…చెన్నైపై గ్రాండ్ విక్టరీ

పంజాబ్ లాస్ట్ పంచ్…చెన్నైపై గ్రాండ్ విక్టరీ

చెన్నైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నాలుగు వికెట్లు కోల్పోయి ఇంకా రెండు ఓవర్లు ఉండగానే 173 పరుగులు చేసింది. పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ 36 బంతుల్లో 7 ఫోర్లు,5 సిక్సులతో 71 పరుగులు చేయడంతో పంజాబ్ ఈజీగా విజయం సాధించింది. చెన్నై బౌలర్లలో హర్బజన్ సింగ్ కు 3 వికెట్లు, జడేజాకు ఒక వికెట్ పడ్డాయి.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 రన్స్ చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ దూకుడుగా ఆడాడు.55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్ లతో 96 పరుగులు చేశాడు. రైనా కూడా 38 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సులతో 53 పరుగులు చేయడంతో చెన్నై స్కోరు 170 చేయగల్గింది. పంజాబ్ బౌలర్లలో షమీకి 2, కర్రన్ కు 3 వికెట్లు పడ్డాయి.

రెండు జట్లకు ఈ లీగ్ లో చివరి మ్యాచ్  ఇది . చెన్నై 14 మ్యాచ్ లు ఆడి 9 గెలిచి పాయింట్ల  పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయితే ముంబై,కోల్ కతా మ్యాచ్ లో ముంబై గెలిస్తే సెకండ్ ప్లేస్ కు పడిపోతుంది. ఇక 14 మ్యాచ్ లలో ఆరు గెలిచిన పంజాబ్ టోర్నీ ప్లే ఆఫ్ అవకాశాలు  కోల్పోయింది.