పోలీస్‌ డ్యూటీ మీట్‌ లోట్రాఫిక్ ఏసీపీ ప్రతిభ

పోలీస్‌ డ్యూటీ మీట్‌ లోట్రాఫిక్ ఏసీపీ ప్రతిభ

పంజాగుట్ట, వెలుగు: కేరళలో జరిగిన ఆల్‌ ఇండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌ (టేబుల్​టెన్నీస్​క్లస్టర్)లో పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ సత్తా చాటారు. ఏప్రిల్ 7 నుంచి 15 వరకు జరిగిన పోటీల్లో డబుల్స్, మిక్సిడ్​విభాగంలో రెండు కాంస్య పతకాలు సాధించారు. పతకాలు సాధించిన ఆయనను ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్లు సైదులు, బోస్​కిరణ్​, సాయిప్రకాష్​, ప్రవీణ్ గురువారం ఏసీపీని కలిసి శుభాంకాక్షలు తెలిపారు.