కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా శ్రీవాస్తవ

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా శ్రీవాస్తవ

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల శాఖలను పునర్‌‌‌‌ వ్యవస్థీకరించింది. ఆర్థిక, రక్షణ, మైనారిటీ శాఖల్లో అధికారులను బదిలీ చేసింది. ప్రస్తుతం ప్రధాన మంత్రి కార్యాలయంలో స్పెషల్  సెక్రటరీగా ఉన్న పుణ్య సలీల శ్రీవాస్తవను ఆరోగ్య శాఖ కార్యదర్శిగా నియమించింది. వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలో త్వరలో ఆమె ఓఎస్డీ (ఆఫీసర్  ఆన్  స్పెషల్  డ్యూటీ) గా బాధ్యతలు చేపట్టనున్నారు.