
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జలగం వెంగళరావు పార్కులో వెటర్నరీ అధికారులు ఆదివారం కుక్క పిల్లల దత్తత కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 16 కుక్క పిల్లలను ప్రదర్శించగా, 11 పిల్లలను జంతు ప్రేమికులు దత్తత తీసుకున్నారు. చీఫ్ వెటర్నరీ అధికారి అబ్దుల్ వకీల్, ఇతర వెటర్నరీ అధికారులు దత్తత తీసుకున్న పిల్లలను యజమానులకు అందజేశారు.