జూన్‌‌లో సెట్స్‌‌కు పూరి, విజయ్ సేతుపతి మూవీ..

జూన్‌‌లో సెట్స్‌‌కు పూరి, విజయ్ సేతుపతి మూవీ..

విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో  రీసెంట్‌‌గా ఓ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ నటి టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  కాస్ట్ అండ్ క్రూ దాదాపు  ఖరారు కావడంతో  ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై అంతటా లొకేషన్స్  రెక్కీ చేస్తున్నారు మేకర్స్. మొదటి షూటింగ్ షెడ్యూల్‌‌ను జూన్ చివరి వారంలో స్టార్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ షెడ్యూల్‌‌లో  విజయ్ సేతుపతి సహా  ఇతర ప్రధాన నటులంతా జాయిన్ కానున్నారు.  

ఇందులో విజయ్‌‌ని  సరికొత్తగా చూపించబోతున్నట్టు, ఆయన స్ర్కీన్ ప్రెజెన్స్ అందర్నీ ఇంప్రెస్ చేసేలా ఉంటుందని మేకర్స్ చెప్పారు. ఇది పూర్తి స్థాయి మాస్, కమర్షియల్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా ఉండబోతోందని,  పూరి సిగ్నేచర్ స్టైల్, విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ బ్లెండ్ చేసే ప్రత్యేకమైన కథాంశంతో విభిన్నంగా ఉంటుందని తెలియజేశారు.  పూరి కనెక్ట్స్ బ్యానర్‌‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.  ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.