విజయ్ సేతుపతి లీడ్‌గా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’. చార్మీ కౌర్, జెబి నారాయణ రావు కొండ్రోల్లాతో కలిసి ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం రీ రికార్డింగ్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపును అందుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
దర్శకుడు పూరి జగన్నాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి రికార్డింగ్ స్టూడియోలో కూర్చొని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫొటో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పూరి మార్క్ ఇంటెన్స్ ఎమోషన్స్, రా యాక్షన్‌కు తగ్గట్టుగా మ్యూజిక్ కూడా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారు.
