పుష్కర ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలి.. గోదావరిని క్లీన్‌‌గా ఉంచాలి.. మంత్రి శ్రీధర్‌‌ బాబు సూచన

పుష్కర ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలి.. గోదావరిని క్లీన్‌‌గా ఉంచాలి.. మంత్రి శ్రీధర్‌‌ బాబు సూచన

భూపాలపల్లి రూరల్, వెలుగు : సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో గోదావరిలో వ్యర్థాలను తొలగించి నీటిని క్లీన్‌‌గా ఉంచాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు ఆదేశించారు. బుధవారం భూపాలపల్లి కలెక్టర్‌‌ రాహుల్‌‌శర్మతో కలిసి కాళేశ్వరంలో వీవీఐపీ ఘాట్, గోదావరి ఘాట్‌‌, 100 గదుల సత్రం, హాస్పిటల్‌‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సరస్వతీ పుష్కరాలకు సమయం చాలా తక్కువగా ఉండడంతో పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని డిపార్ట్‌‌మెంట్ల ఆఫీసర్లు కో ఆర్డినేషన్‌‌తో పనిచేయాలని చెప్పారు. కూలీల సంఖ్యను పెంచి పనుల్లో స్పీడ్‌‌ పెంచాలని ఆదేశించారు. వారి వెంట ఎస్పీ కిరణ్‌‌ ఖరే, కాటారం సబ్‌‌ కలెక్టర్‌‌ మయాంక్‌‌ సింగ్‌‌, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ విజయలక్ష్మి, పంచాయతీ రాజ్‌‌, ఇరిగేషన్, ఆర్‌‌డబ్ల్యూఎస్‌‌, వైద్య, దేవాదాయ శాఖల అధికారులు ఉన్నారు.

ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు

ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు చెప్పారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌‌ మండలం ఎల్కేశ్వరం గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలోని పేదలకు గౌరవ ప్రదమైన జీవన వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌ రాహుల్‌‌శర్మ, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ విజయలక్ష్మి, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌‌ ప్రహ్లాద్‌‌ రాథోడ్‌‌ 
పాల్గొన్నారు.