పుష్ప2 డిమాండ్ మాములుగా లేదుగా.. ఇది నెక్స్ట్ లెవల్ క్రేజ్

పుష్ప2 డిమాండ్ మాములుగా లేదుగా.. ఇది నెక్స్ట్  లెవల్ క్రేజ్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా(Rashmika mandana) హీరోయిన్ వస్తున్న లేటెస్ట్ మూవీ "పుష్ప ది రూల్"(Pushpa the rule). పుష్ప సినిమా కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్ట్ భారీ విజయం సాధించిన నేపధ్యంలో ఈ సినిమాపై కూడా అంచనాలి భారీగా ఏర్పడ్డాయి. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

అందుకే ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రంగా “పుష్ప 2 ది రూల్” ఉంది. బాహుబలి 2, కేజీయఫ్ 2 ల తర్వాత ఆ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ఆడియెన్స్ కూడా అదే రేంజ్లో ఎదురు చూస్తున్నారు. ఇక పుష్ప మొదటి పార్ట్ 350 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టడంతో.. సీక్వెల్ ఖచ్చితంగా1000 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. దీంతో ఈ సినిమాకు శాండిల్ వుడ్ లో భారీ బిజినెస్స్ ఏర్పడిందని తెలుస్తుంది. మేకర్స్ 30 కోట్ల వరకు డిమాండ్ చేస్తుండగా.. కన్నడ బయ్యర్స్ 25 వరకు ఒకే అంటున్నారట. 

ఒకవేళ 30 కోట్ల బిజినెస్ లాక్ అయితే టాలీవుడ్ నుంచి మరో బిగ్గెస్ట్  బిజినెస్ చేసిన సినిమాగా పుష్ప 2 నిలువనుంది. మరి రిలీజ్ కు ముందే ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.