పుష్ప 2 థియేట్రికల్​ రైట్స్​రూ.1000 కోట్లు?

పుష్ప 2 థియేట్రికల్​ రైట్స్​రూ.1000 కోట్లు?

పుష్ప (Pushpa) సినిమాతో వచ్చి అల్లు అర్జున్​ (Allu arjun)బాక్సాఫీస్​ వద్ద రూ.300 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టాడు. రష్మిక పెర్ఫామెన్స్, సమంత స్పెషల్​ సాంగ్ ​సినిమాకు ప్లస్​ అయ్యాయి. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వల్ గా పుష్ప 2 (Pushpa 2) రూపొందుతున్న విషయం తెలిసిందే. పుష్ప ది రూల్​ కూడా ఏ మాత్రం అంచనాలకు తగ్గకుండా ఉండేలా డైరెక్టర్​సుకుమార్​ప్లాన్​చేస్తున్నాడు. ఈ చిత్రంపై తాజాగా ఓ వార్త​వినిపిస్తోంది. 

పుప్ప 2 థియేట్రికల్​రైట్స్(Pushpa 2 rights)​ రూ.వెయ్యి కోట్లు డిమాండ్​ చేసినట్లుగా బాలీవుడ్​ క్రిటిక్ ​కమల్​ ఆర్​ ఖాన్​ ఈ విషయాన్ని ట్విట్టర్​లో షేర్​చేసినట్లు తెలుస్తోంది. అన్ని భాషల్లో కలిపి వెయ్యి కోట్ల వరకు గ్రాస్​ రావ్వొచ్చని ఫ్యాన్స్​ సోషల్​ మీడియాలో డిస్కషన్స్​ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ (RRR)​ థియేట్రికల్ బిజినెస్ ​ఆల్​ లాంగ్వేజ్​లతో కలిపి రూ.900 కోట్లు వచ్చాయి. మరి పుప్ప2 ఈ రికార్డును బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఏప్రిల్ లేదా మే నెలలో గ్రాండ్ గా విడుదల చేయాలని ఫైనల్ అయ్యారట సుకుమార్.