పుష్ప–2 టికెట్ రేట్ల పెంపుపై ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ యలమంచిలి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందరూ టికెట్ రేట్ ఏదో 800.. 800 అనుకుంటున్నారని, కానీ ఆ ధర కేవలం ప్రీమియర్ షో వరకూ మాత్రమే ఉందని చెప్పారు. ఆ ఒక్క షోకే 800 ఉందని, అది అయిపోయిందని.. ఇక నుంచి అందుబాటు ధరలోనే పుష్ప–2 టికెట్స్ ఉంటాయని నిర్మాత చెప్పారు.
మరొక్కసారి టికెట్ రేట్లపై రివ్యూ చేసుకుని అందుబాటు ధరల్లోనే పుష్ప–2 టికెట్ ధరలు ఉంచుతామని, అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని రవిశంకర్ ప్రేక్షకులను కోరారు. నిర్మాత చెప్పినట్టుగా 800 టికెట్ ధర ప్రీమియర్ షోలకు మాత్రమే వర్తించింది. కానీ.. ఆ తర్వాత కూడా పుష్ప–2 టికెట్లపై తక్కువ ధరేం కాదు. మల్టీప్లెక్స్ లో పుష్ప–2 సినిమా చూడాలంటే 572 రూపాయలు చెల్లించాల్సిందే.
ALSO READ : Pragya Nagra: ఆ వీడియోల్లో ఉన్నది నేను కాదు.. ప్లీజ్ నమ్మండి : లగ్గం నటి ప్రజ్ణా నగ్రా
సింగిల్ స్క్రీన్ అయినా.. బాల్కనీ 350 ప్లస్ ట్యాక్స్ (టోటల్ 390 రూపాయలు), ఫస్ట్ క్లాస్ 250 ప్లస్ ట్యాక్స్ (టోటల్ 283 రూపాయలు), సెకండ్ క్లాస్ 150 ప్లస్ ట్యాక్స్ (173 రూపాయలు). ఇది ఈ వీకెండ్ వరకూ హైదరాబాద్ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పుష్ప–2 టికెట్ రేట్లు. సింగిల్ స్క్రీన్ థియేటర్లో బాల్కనీ టికెట్కు 390 రూపాయలు చెల్లించడం అంటే తక్కువేం కాదు. సోమవారం నుంచి పుష్ప–2 టికెట్ ధరలను తగ్గించే అవకాశం ఉంది. అప్పుడు కూడా మాములుగా ఉండే రేట్ల కంటే యాభైనో, వందనో ఎక్కువే ఉండే ఛాన్స్ ఉంది.