భువనేశ్వరి బంగారు గాజులు కాదు..హెరిటేజ్ పేరుతో కొట్టేసిన భూములివ్వాలి : ఏపీ డిప్యూటీ సీఎం

భువనేశ్వరి బంగారు గాజులు కాదు..హెరిటేజ్ పేరుతో కొట్టేసిన భూములివ్వాలి :  ఏపీ డిప్యూటీ సీఎం

రాజధానికి గ్రామస్తులకు నారా భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదని, ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరుతో కొట్టేసిన భూములు ఇచ్చేయాలని సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు.

రాజధానిని తరలించొద్దని డిమాండ్ చేస్తూ అమరావతి ఎర్రబాలెంలో  రైతులు చేస్తున్న దీక్షకు మాజీ సీఎం చంద్రబాబు ఆయన సతీమణి నారాభువనేశ్వరి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భువనేశ్వరి రాజధాని పరిరక్షణ సమితికి భువనేశ్వరి బంగారు గాజును విరాళంగా ఇచ్చారు.

అయితే భువనేశ్వరి బంగారు గాజులు విరాళం ఇవ్వడంపై పుష్పశ్రీవాణి స్పందించారు. రాజధాని రైతులకు ఇవ్వాల్సింది బంగారు గాజు కాదని హెరిటేజ్ పేరిట కొట్టేసిన 14.22ఎకరాలు, టీడీపీ నేతలు దోచుకున్న 4వేల ఎకరాల్ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి ప్రజాశ్రేయస్సు అవసరం లేదని, భూముల్ని కాపాడుకునేందుకు అమరావతిలో రాజకీయం చేస్తున్నారని అన్నారు.

రైతుల కోసమే తాను ఇక్కడి వచ్చినట్లు భువనేశ్వరి చెప్పడం విచారకరమన్నారు పుష్పశ్రీవాణి.