దూసుకు పోతున్న పుష్ప2.. ఒక్క వీడియోకు మిలియన్ల వ్యూస్

దూసుకు పోతున్న పుష్ప2.. ఒక్క వీడియోకు మిలియన్ల వ్యూస్

ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమా ఎంత క్రేజ్ సంపాధించిందో అందరికీ తెలుసు. ఆ సినిమాలోని డైలాగ్స్, డాన్స్, అల్లు అర్జున్ గ్రేస్.. ఆడియన్స్ ని ఎంతగానో అట్రాక్ట్ చేశాయి. రీల్స్ చేసి సోషల్ మీడియా వైరల్ అయిన వాళ్లూ ఉన్నారు. ఆ క్రేజ్ తోనే పుష్ప2 సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. అయితే, తాజాగా రిలీజ్ అయిన టీజర్ ఆ హైప్ కు ఏ మాత్రం తీసిపోలేదు. స్టోరీ టెల్లింగ్, డైలాగ్స్, స్ర్కీన్ ప్లే.. ఆ చిన్న టీజర్లోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో చూపించాడు డైరెక్టర్ సుకుమార్.
  
ఆ టీజర్ ఇప్పుడు రికార్డులు తిరగరాస్తోంది. యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో రిలీజ్ అయిన టీజర్.. 100 మిలియన్ వ్యూస్, 3.3 మిలియన్ లైక్స్ సాధించినట్లు పుష్ప2 మేకర్స్ ప్రకటించారు. ‘పుష్ప రాజ్.. తన రూల్ మొదలుపెట్టాడు’ అని ట్వీట్ చేశారు.