డోనెట్స్ కు ఫ్రావిన్స్ మొత్తం వదలాలన్న పుతిన్.. వదులుకునే సమస్యేలేదన్న జెలెన్ స్కీ?

డోనెట్స్ కు  ఫ్రావిన్స్ మొత్తం  వదలాలన్న పుతిన్.. వదులుకునే సమస్యేలేదన్న జెలెన్ స్కీ?

వాషింగ్టన్: ఉక్రెయిన్​తో యుద్ధం ఆపాలంటే తాము స్వాధీనం చేసుకున్న డోనెట్స్క్ ప్రావిన్స్ మొత్తాన్ని తమకు విడిచిపెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్ చేసినట్టుగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో పుతిన్ చేసిన డిమాండ్ గురించి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీకి ట్రంప్ శనివారం తెలియజేశారని, కానీ అందుకు జెలెన్ స్కీ ఒప్పుకోలేదని తెలిపాయి. ఇప్పటికే ఉక్రెయిన్ లోని ఐదో వంతు భూభాగం రష్యా కంట్రోల్ లోకి వెళ్లింది. 

డోనెట్స్క్ ఇండస్ట్రియల్ ప్రావిన్స్ లో 2014లోనే అడుగుపెట్టిన రష్యా ఇప్పుడు మూడొంతుల భాగాన్ని ఆక్రమించుకున్నది. మరోవైపు రష్యా అతిశక్తిమంతమైన దేశమని, దాని బలంతో పోల్చుకుంటే ఉక్రెయిన్ చాలా చిన్నదని ట్రంప్ చెప్పినట్టుగా తెలుస్తున్నది. అందుకే ఒప్పందం కుదర్చుకుని యుద్ధానికి ముగింపు పలకాలని జెలెన్ స్కీకి సూచించినట్టుగా అనధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్, యూరప్ దేశాలు డిమాండ్ చేసినట్టుగా నేరుగా శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు పుతిన్ అంగీకరించారని కూడా ట్రంప్ చెప్పినట్టు తెలిపాయి.