
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చమురు దిగుమతుల విషయంలో భారతదేశానికి అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్లను తిప్పికొట్టేలా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. భారత్ ఎవరి ముందు తలవంచదంటూ సోచీలో జరిగిన వాల్డై డిస్కషన్ గ్రూప్ సమావేశంలో ఈ కామెంట్ చేశారు పుతిన్. భారత ప్రధాని మోడీ తన దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు.
భారత్‌పై అమెరికా ఒత్తిడి..
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఆర్థిక వనరులు తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్, భారత్, చైనా వంటి దేశాలను రష్యా చమురు కొనుగోళ్లు ఆపాలని పిలుపునిచ్చారు. దీనిపై ప్రతిస్పందించిన పుతిన్.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపితే ఆర్థిక నష్టాలు 9–10 బిలియన్ డాలర్లకు వరకూ పెరిగే అవకాశముందని చెప్పారు.
భారత్ దిగుమతులను కొనసాగిస్తే సాంక్షన్లు ఎదురవుతాయని బెదిరింపులకు దిగుతున్న అమెరికా వైఖరిని ఆయన ఎత్తిచూపారు. “నష్టాలు రెండు వైపులా ఒకేలా ఉంటే, భారత్ ఎందుకు అమెరికా ఒత్తిడికి లొంగాలి? అంతేకాకఇది అంతర్గత రాజకీయ వ్యయాన్నీ పెంచుతుంది” అని అన్నారు.
ALSO READ : వందే భారత్ రైలు ఢీకొని నలుగురు యువకులు చనిపోయారు
భారత్–రష్యా సంబంధాలు..
పుతిన్ ప్రసంగంలో భారత్‌తో ఉన్న “ప్రివిలేజ్‌డ్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్”ను ఆయన మరోసారి ప్రస్తావించారు. ఇంతదాకా ఉన్న బంధం కేవలం వాణిజ్యం కాదని.. చారిత్రక మైత్రి అని పుతిన్ గుర్తు చేశారు. మోడీని ఆయన “సమతుల్యత గల, జ్ఞానవంతమైన, దేశ ప్రయోజనాలను ముందుంచే నేత”గా ప్రశంసించారు.
రష్యా చమురు సరఫరా తగ్గితే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు బ్యారెలుకు100 డాలర్ల పైకి చేరతాయని పుతిన్ హెచ్చరించారు. భారత్‌తో చెల్లింపుల సమస్యను త్వరలోనే బ్రిక్స్ లేదా ఇతర ద్వైపాక్షిక మార్గాల్లో పరిష్కరించనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడిన పుతిన్.. పశ్చిమ దేశాలు యుద్ధాన్ని పొడిగిస్తున్నాయని ఆరోపించారు. నాటో దేశాలు ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా ట్రైనర్స్, సాంకేతిక సహాయం, శాటిలైట్ సమాచారాన్ని అందించి ఉక్రెయిన్‌కు తోడ్పడుతున్నట్లు చెప్పారు. అలాగే యూరప్ ప్రత్యేకంగా శిక్షణ, ఆయుధ సరఫరాలు, ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ వ్యవస్థను అందిస్తోందని చెప్పారు. మెుత్తానికి భారత్‌పై విశ్వాసం– మోడీపై ఉన్న పుతిన్ నమ్మకంతో.., భారత్ ఎప్పటికీ అమెరికా ఒత్తిడికి తలవంచదని బలంగా ఉన్నారు.