పుట్ట మధు అరెస్ట్

V6 Velugu Posted on May 08, 2021

పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. గత వారం రోజులుగా అదృశ్యానికి గల కారణాలపై రామగుండం పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. వామనరావు దంపతుల హత్య కేసులోనూ పుట్ట మధుపై బలంగా ఆరోపణలు వినిపించాయి. ఆయన్ను ఈ కేసులో ఇప్పటికే రామగుండం కమిషనరేట్ పోలీసులు ఓసారి విచారించారు. వామనరావు తండ్రి కిషన్ రావు ఇటీవల మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లయింట్ పైనా పుట్ట మధును టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే... పుట్ట మధును ఎక్కడ అదుపులోకి తీసుకున్నారనేదానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు.

Tagged arrest, Putta Madhu,

Latest Videos

Subscribe Now

More News