మెహిదీపట్నం, వెలుగు: పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై స్పీడ్‌గా వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వల్ల బోల్తా పడింది. పాతబస్తీ ప్రాంతానికి చెందిన అబ్బు తన కారులో మెహిదీపట్నం నుంచి శంషాబాద్ కు బుధవారం సాయంత్రం వెళ్తున్నాడు. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 28 వద్ద సడన్ గా బ్రేక్ వేశాడు. కారు వేగంగా ఉండడంతో అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
