సౌదీలో గుండెపోటుతో కరీంనగర్ వాసి మృతి

సౌదీలో గుండెపోటుతో కరీంనగర్ వాసి మృతి

గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హనుమాజిపల్లె గ్రామానికి చెందిన పారునంది వీరయ్య(44) సౌదీ అరేబియాలో బుధవారం గుండెపోటుతో చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఉపాధి కోసం వీరయ్య ఏడాది కింద సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 

బుధవారం పార్కింగ్  చేసిన కారులో సేద తీరుతుండగా, గుండెపోటు రావడంతో అక్కడే చనిపోయాడు. తోటి కార్మికులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. డెడ్​బాడీని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.