హైదరాబాద్లో ఏపీ మాజీ సీఎం జగన్కు ఘన స్వాగతం

హైదరాబాద్లో ఏపీ మాజీ సీఎం జగన్కు ఘన స్వాగతం

హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ బేగంపేట ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు. జగన్ అభిమానులు భారీగా చేరుకుని బేగంపేట ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తల నినాదాలతో బేగంపేట విమానాశ్రయ ప్రాంగణం మార్మోగింది. సీఎం సీఎం అంటూ.. వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎయిర్ పోర్ట్ బయట కార్యకర్తలను ఆపివేయడంతో పోలీసులను తప్పించుకొని మరీ ఎయిపోర్ట్లోకి వైసీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు.

వైఎస్‌ జగన్‌ కోర్టు అనుమతితో ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో ఆయన అటెండెన్స్ ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చారు. ఆరేళ్ల తరువాత జగన్ ఇవాళ కోర్టులో హాజరవుతున్నారు. 

చివరి సారి 2020 జనవరి 10న కోర్టులో జగన్ హాజరయ్యారు. 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్పై ఉన్నారు. జగన్ సీఎం అయిన తరువాత కోర్టు ఎదుట వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దక్కింది. ఏపీ ఎన్నికల్లో ఓడిన తర్వాత మళ్లీ ఇప్పుడే జగన్ నాంపల్లి కోర్టులో హాజరవడానికి వచ్చారు.