క్వార్టర్స్‌‌లో సింధు  లక్ష్యసేన్‌‌ ఔట్‌‌

క్వార్టర్స్‌‌లో సింధు  లక్ష్యసేన్‌‌ ఔట్‌‌

కౌలాలంపూర్‌‌: ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు.. మలేసియా మాస్టర్స్‌‌ సూపర్‌‌-–500 టోర్నీలో క్వార్టర్‌‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో డబుల్‌‌ ఒలింపిక్‌‌ మెడలిస్ట్‌‌  సింధు 21–-16, 21–-11తో ఆయా ఓహోరి (జపాన్‌‌)ను చిత్తు చేసింది. ఓహోరిపై గెలవడం తెలుగమ్మాయి ఇది 13వ సారి. 40 నిమిషాల మ్యాచ్‌‌లో సింధు పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. బలమైన క్రాస్‌‌ కోర్టు ర్యాలీలతో పాటు నెట్‌‌ వద్ద సూపర్‌‌ డ్రాప్స్‌‌తో ఆకట్టుకుంది.

ఇక మెన్స్‌‌ సింగిల్స్‌‌లో లక్ష్యసేన్‌‌కు ఓటమి ఎదురుకాగా, కిడాంబి శ్రీకాంత్‌‌, హెచ్‌‌. ఎస్‌‌. ప్రణయ్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌‌లో లక్ష్యసేన్‌‌ 14–21, 19–21తో అంగుస్‌‌ ఎంగ్‌‌ కా లాంగ్‌‌ (హాంకాంగ్‌‌) చేతిలో ఓడాడు. 48 నిమిషాల మ్యాచ్‌‌లో తొలి గేమ్‌‌లో తేలిపోయిన ఇండియన్‌‌ ప్లేయర్‌‌.. రెండో గేమ్‌‌లో గట్టి పోటీ ఇచ్చాడు. కానీ చివర్లో ప్రత్యర్థి కొట్టిన బలమైన స్మాష్‌‌లను అడ్డుకోలేక మ్యాచ్‌‌ను చేజార్చుకున్నాడు. ఇతర మ్యాచ్‌‌ల్లో శ్రీకాంత్‌‌ 21–19, 21–19తో ఇండియా ఓపెన్‌‌ చాంప్‌‌, 8వ సీడ్‌‌ కున్లావట్‌‌ విటిడార్న్‌‌ (థాయ్‌‌లాండ్‌‌)పై, వరల్డ్‌‌ 9వ ర్యాంకర్‌‌ హెచ్‌‌.ఎస్‌‌. ప్రణయ్‌‌ 13–21, 21–16, 21–11తో లీ షి ఫెంగ్‌‌ (చైనా)పై గెలిచారు.