జకర్తా : ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్.. ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన విమెన్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ సింధు 23–21, 20–22, 21–11తో జార్జియా మరిస్కా తంజంగ్ (ఇండోనేసియా)పై గెలిచింది. గంటా 11 నిమిషాల మ్యాచ్‌లో సింధు రెండో గేమ్‌ను చేజార్చుకుంది. అయితే మూడో గేమ్‌లో వ్యూహాత్మకంగా ఆడిన తెలుగమ్మాయి వరుస పాయింట్లతో హోరెత్తించిం గెలిచింది. మెన్స్ ప్రిక్వార్టర్స్‌లో ఏడోసీడ్ లక్ష్యసేన్ 21–18, 21–15తో రాస్ముస్ గెమ్కే (డెన్మార్క్)పై గెలిచి ముందడుగు వేశాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమీత్–అశ్విని 18–21, 13–21తో జెంగ్ సీ–హంగ్ క్వియాంగ్ (చైనా) చేతిలో ఓడారు.

