
ఇప్పటి వరకు సినిమా అనుభవం అందరికీ తెలిసిందే. సింగిల్ ధియేటర్, మల్టీఫ్లెక్స్ వరకు చూసే ఉంటారు. ధియేటర్ ఇంటర్వెల్ లో పాప్ కార్న్, సమోసా, కూల్ డ్రింగ్స్ ఇలా స్నాక్స్ ఐటమ్స్ తో సినిమా ఎంజాయ్ చేసిన అనుభవం అందరిదీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. సరికొత్త అనుభవం పరిచయం చేయబోతున్నది సినిమా ధియేటర్. ఇది సినిమా అనుభవంలో కొత్త యుగంగా చెప్పొచ్చు.. ఇంతకీ ఏంటంటారా ఇదీ.. డైన్ ఇన్ ధియేటర్. అవును.. బెంగళూరు సిటీలో మొట్ట మొదటి లగ్జరీ డైన్ ఇన్ సినిమా ప్రారంభించింది పీవీఆర్ ఐనాక్స్. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందామా..
ఈ ధియేటర్ ఓ లగ్జరీ రెస్టారెంట్ తరహాలో ఉంటుంది. 360 డిగ్రీలు తిరిగే విధంగా సీట్లు ఉంటాయి. ఇవి కూడా చాలా చాలా లగ్జరీ సీట్లు. మధ్యలో డైనింగ్ టేబుల్ ఉంటుంది. ముందు సినిమా స్క్రీన్ ఉంటుంది. లేటెస్ట్ గా బెంగళూరు సిటీలోని M5 Ecity మాల్ లో కొత్తగా 8 మల్టీఫ్లెక్స్ స్క్రీన్స్ ప్రారంభిస్తే.. అందులో ఒకటి డైన్ ఇన్ తరహా ధియేటర్ ఓపెన్ చేసింది పీవీఆర్ ఐనాక్స్. ప్రస్తుతం ఈ ధియేటర్ లో కంతారా చాప్టర్ 1 మూవీ ప్రదర్శిస్తున్నారు. ఈ ధియేటర్ లో టికెట్ బుక్ చేసుకునే వాళ్లకు వెయిటింగ్ కోసం ప్రత్యేకంగా కెఫే కూడా ఉంది. ముందుగా వచ్చిన ప్రేక్షకులు ఇక్కడ రిలాక్స్ అవ్వొచ్చు.
సీట్ల దగ్గరకే చెఫ్ లు భోజనం తెచ్చి ఇస్తారు. కావాల్సిన వంటకాలను వేడి వేడిగా వడ్డిస్తారు. పిజ్జా, బర్గర్, హాట్ డాగ్స్, శాండ్ విచ్ లు, కూల్ డ్రింగ్స్, పాప్ కార్న్, టీ, కాఫీ, సౌత్, నార్త్ ఇండియన్ ఫుడ్, నాన్ వెజ్, వెజ్ భోజనం ఇలా ఏది కావాలంటే ఆ ఫుడ్ వేడి వేడిగా.. స్పైసీగా కావాలంటే స్పైసీ లేదు నాన్ స్సైసీ.. మీ టెస్ట్ కు తగ్గట్టు.. మీ సీటు దగ్గరకే వచ్చి వడ్డిస్తారు.
ఇంత చెప్పారు టికెట్ ధరలు ఎంత అంటారా.. సోఫా సీటుకు 14 వందల రూపాయలు, టూ టేబుల్ సీట్లకు 950 రూపాయలు, త్రీ టేబుల్ సీట్లకు 750 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికి GST అదనం. ఫుడ్ ఛార్జీలు కూడా అదనం.
ఇండియాలో ఈ తరహా డైన్ ఇన్ ధియేటర్ అనేది ఇదే ఫస్ట్. సినిమా అనుభవంలో కొత్త యుగంగా సినీ ఇండస్ట్రీ చెబుతోంది. ఇంత పెట్టి ఈ డైన్ ఇన్ ధియేటర్ కు ఎవరు వస్తారు అనుకోవద్దండీ.. టికెట్ హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. అస్సలు ఖాళీ ఉండటం లేదంట.. బెంగళూరు సిటీలో ఉన్న రిచ్ పీపుల్ కు ఈ ధియేటర్ ఏం సరిపోతుంది అంటున్నారు నెటిజన్లు..