చలాన్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నరు : గోపాల్ రెడ్డి

చలాన్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నరు :  గోపాల్ రెడ్డి

ఉప్పల్, వెలుగు: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై చలాన్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి అన్నారు. కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులకు ట్రాఫిక్ పర్మిషన్ అవసరం లేదని,రూ. 400 పర్మిషన్ కొరకు చలాన్ కట్టి తెలంగాణలో తిరుగుతున్నామని పేర్కొన్నారు. కానీ బస్సులకు సిటీలో నో ఎంట్రీ పర్మిషన్ పేరుతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తున్నారన్నారు.

సోమవారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు మెగాసిటీ కొండల్ రెడ్డి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాహనానికి ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు రూ. 2 వేల ఫైన్ వేశారు. దీంతో నిరసనగా టూర్స్, ట్రావెల్స్ అసోసియేషన్ సభ్యులు ఉప్పల్ ట్రాఫిక్ డీసీపీ,ఏసీపీ, సీఐలకు వినతిపత్రాలు అందజేశారు. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత కమిషనర్ సీవీ ఆనంద్ 12 మీటర్ల బెంగళూరు టు హైదరాబాద్ తిరిగే బస్సులు సిటీ లోపలికి రావడంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని, నో ఎంట్రీ విధానం తెచ్చారని గుర్తుచేశారు.

కానీ తమకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని, ఎలాంటి పర్మిషన్లకు చలాన్లు కట్టాలన్నా సిద్ధంగా ఉన్నామన్నారు. పర్మిషన్స్ కు అప్లై చేసి మూడు,నాలుగు నెలలు అవుతున్నా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారులు తొందరగా పర్మిషన్ ఇవ్వకుంటే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఉప్పల్ సెక్రటరీ కొండల్ రెడ్డి, సభ్యులు కిరణ్ ,సంతోష్ రెడ్డి, కమిటీ సభ్యులు ఉన్నారు.