న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్ డైరెక్షన్‌ను యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం, ఇండియన్ కంపెనీల రిజల్ట్స్, మాక్రో ఎకనామిక్ డేటా నిర్ణయించనున్నాయి. ఐఓసీ, టీవీఎస్ మోటార్, ఎల్ అండ్ టీ, హిందుస్తాన్ పెట్రోలియం, ఐటీసీ, సిప్లా, డాబర్, మారుతి, ఏసీసీ వంటి కంపెనీల ఫలితాలు మార్కెట్ డైరెక్షన్‌పై ప్రభావం చూపుతాయని ఎనలిస్టులు భావిస్తున్నారు.
ఈ నెల 28న ఇండియా సెప్టెంబర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా విడుదల కానుంది. అంతర్జాతీయంగా చూస్తే, అక్టోబర్ 29న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం ఉంది. దీనికి తోడు యూఎస్–చైనా అధ్యక్షుల సమావేశం, బ్రెంట్ క్రూడ్ ధరలు, విదేశీ పెట్టుబడిదారుల ట్రేడింగ్ కార్యకలాపాలపై ట్రేడర్లు ఫోకస్ పెట్టాలి. యూఎస్ జీడీపీ డేటా, ఈసీబీ, బ్యాంక్ ఆఫ్ జపాన్‌ల వడ్డీ రేట్ల నిర్ణయం కూడా కీలకంగా మారనున్నాయి.
