క్యూనెట్ మోసం : సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సూసైడ్

క్యూనెట్ మోసం : సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సూసైడ్

క్యూనెట్ చేతిలో మోసపోయిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు.  శ్రీకాకుళానికి చెందిన అరవింద్‌ హైదరాబాద్ లో ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ గా పనిచేస్తున్నాడు. గతంలో అరవింద్‌ మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ (క్యూనెట్) లో 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. చాలాసార్లు తన డబ్బులు తనకు వెనక్కి ఇవ్వాలని అడిగిన ఫలితం లేకుండా పోయింది. దీంతో మనస్తాపం చెందిన అరవింద్ మంగళవారం రాత్రి మాదాపూర్‌ లో తన నివాసంలో సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని డెడ్ బాడీని పోస్ట్‌ మార్టంకు తరలించారు.