డేంజర్​గా సుందిళ్ల కట్ట

డేంజర్​గా సుందిళ్ల కట్ట
  • రెండు వారాలైతున్నా రిపేర్లు చేయని ఆఫీసర్లు
  • గండి పడే ప్రమాదం.. రెండు గ్రామాల్లో టెన్షన్

పెద్దపల్లి, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సుందిళ్ల(పార్వతి) బ్యారేజీ కరకట్టకు భారీ కయ్య పడింది. గోదావరిలో ఇటీవల ప్రవాహానికి బ్యారేజీని ఆనుకొని ఉన్న కట్ట మట్టి కోసుకుపోయి ప్రమాదకరంగా తయారైంది. ఈ కయ్యను పూడ్చేందుకు రెండు వారాలుగా ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోసారి వరద వస్తే కట్టకు గండిపడి ఎక్కడ తమ ఊర్లను ముంచెత్తుతుందోనని రెండు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు కనీసం తాత్కాలిక రిపేర్లు కూడా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గోదావరికి వరదలు రావడంతో ఈ నెల 14న సుం దిళ్ల బ్యారేజీ కరకట్ట 50 మీటర్ల పొడవునా ఓవైపు కోసుకుపోయింది. అదృష్టవశాత్తూ గండి పడలేదు. దీనిపై పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం, దుబ్బపల్లె గ్రామాల్లోని వెయ్యికి పైగా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. రెండు, మూడు రోజులు గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, స్థానికంగానూ భారీ వర్షాలు పడ్తున్నాయి. మరోసారి వరద వచ్చి కరకట్టకు గండిపడితే తమ 2ఊళ్లు మునుగుతాయని, పంటలు కొట్టుకపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్ట దెబ్బతిన్నప్పుడు ఆఫీసర్లు, డ్యాం సిబ్బంది ఎవరూ ఇటువైపు తొంగిచూడలేదని స్థానికులు ఆరో పిస్తున్నారు. కిందటేడు ఇలాగే పార్వతి బ్యారేజీ ఇంటర్నల్ వాల్ డ్యామేజీ కావడంతో పాటు, సరస్వతి పంప్ హౌస్ మునిగిపోయింది. 

మూడేండ్లలో బయటపడ్డ లోపాలు
    2019 ఆగస్టులో లక్ష్మీపూర్‌‌‌‌ పంప్‌‌‌‌హౌస్ వద్ద రక్ష ణ గోడ ‌‌దెబ్బతిని నీళ్లు లీకయ్యాయి. ఆ తర్వాత 2019 సెప్టెంబర్‌‌‌‌ 3న రక్షణ గోడ దెబ్బతినడంతో కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​‌‌లోని మోటార్లపై నీళ్లుపడి ఖరాబ్​అయ్యాయిరెండో మోటార్‌‌ ఆన్‌‌‌‌ చేయగా గేట్‌‌‌‌వాల్వ్‌‌‌‌ లీకై నీరు ఎగజిమ్మింది. ఈ నీరు కూడా వర్షపు నీటికి జత కలిసి పంపు హౌస్ లోకి వచ్చాయి. మూడో టీఎంసీ ఎత్తిపోతల కోసం జరుపుతున్న పనుల సందర్భంగా రక్షణ గోడ దెబ్బతినడం వల్ల ఈ ఘటన జరిగింది. వందల కోట్ల నష్టం జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

* 2019 అక్టోబర్‌‌‌‌ 09న అన్నారం బ్యారేజీ గేట్లు లీకయ్యాయి. కాంట్రాక్టర్‌‌‌‌ నాసిరకం పనుల వల్ల ఇలా జరిగిందని అప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో గేట్లకు రిపేర్లు చేయించారు. 

* 2020 ఆగస్టు 23న కొద్దిపాటి వర్షాలకే కాళేశ్వ రం దగ్గర గ్రావిటీ కెనాల్‌‌‌‌ లైనింగ్‌‌‌‌ కూలింది. ప్రాజె క్టు ప్రారంభం దగ్గర పడుతుండటంతో కాంట్రాక్టర్‌‌‌‌ హడావిడిగా పనులు చేయడం వల్ల ఇలా జరిగిందని ఆఫీసర్లు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

* 2021జులై 23న కురిసిన భారీ వర్షాలకు అన్నారం పంప్​హౌస్​లోకి నీళ్లు వచ్చాయి. సుం దిళ్ల బ్యారేజీ నుంచి ఇన్‌‌‌‌ఫ్లో ఎక్కువ ఉండడం, జల్లా రం వాగు పొంగడంతో అన్నారం పంప్‌‌‌‌హౌస్​‌‌లోకి వరద వచ్చి మోటార్లపై నీళ్లు పడ్డాయి. 

* గోదావరి వరదలకు ఈ నెల 14న వేల కోట్లతో నిర్మించిన కన్నెపల్లి(లక్ష్మి), అన్నారం (సరస్వతి) పంప్‌‌‌‌హౌస్​‌‌లు నీట మునిగాయి. విదేశాల నుంచి తెప్పించిన 29 బాహుబలి మోటార్లు నీటి అడుగుకు పడిపోయాయి. వాటర్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌కు సంబంధించిన పరికరాలన్నీ నీట మునిగాయి. కరెంట్‌‌‌‌ సబ్‌‌‌‌ స్టేషన్ల చుట్టూ నీళ్లు నిలిచాయి.

* ఈ వరదల్లోనే కన్నెపల్లి పంప్​హౌస్​ నుంచి అన్నారం బ్యారేజీకి నీళ్లు తీసుకెళ్లే గ్రావిటీ కెనాల్ లైనింగ్ పలుచోట్ల కొట్టుకుపోయింది.

కడెం ప్రాజెక్టు వరద గేట్ల రిపేర్లు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్​కు చెందిన స్వప్న కన్​స్ర్టక్షన్​ సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలో జర్మనీ గేట్ల మోటార్లను కూడా రిపేరు చేయనున్నారు. అయితే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో పనులకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు.