దేశంలో సన్నబియ్యం ఒక్క తెలంగాణే ఇస్తున్నది..రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర్ రావు

దేశంలో సన్నబియ్యం ఒక్క తెలంగాణే ఇస్తున్నది..రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర్ రావు

జగిత్యాల రూరల్, వెలుగు: దేశంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ ఒక్క తెలంగాణే అని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ లో రూ. రూ13. 38 కోట్ల వ్యయంతో 20 వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి భూమి పూజ చేశారు. 

ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ జగిత్యాల జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇక్కడ గోదాముల నిర్మాణం అవసరమన్నారు. గోదాం నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో  డీఈ శ్రీనివాస్, గిరి నాగభూషణం, రవీందర్ రెడ్డి, నారాయణరెడ్డి, సదాశివరావు, చెరుకు జాన్ పాల్గొన్నారు.